హైదరాబాద్ గడ్డి అన్నారం డివిజన్‌లో 200 మంది ట్రాన్స్‌జెండర్లకు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. అవతార్ ఛారిటబుల్ ట్రస్ట్ నిత్యావసర సరకులను సమకూర్చింది. పేదవారిని వలసకూలీలను ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని మంత్రి అన్నారు.
ట్రాన్స్‌జెండర్లకు సరకులను అందజేసిన మంత్రి - హైదరాబాద్ గడ్డి అన్నారం తాజా వార్తలు
గడ్డి అన్నారం డివిజన్‌లో 200 మంది ట్రాన్స్‌జెండర్లకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సరకులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వలస కూలీలకు సాయం చేస్తుందన్నారు.
![ట్రాన్స్‌జెండర్లకు సరకులను అందజేసిన మంత్రి Minister koppula eswar distribute the goods to transgender people at gaddiannaram hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7251647-146-7251647-1589811035201.jpg)
ట్రాన్స్‌జెండర్లకు సరకులను అందజేసిన మంత్రి
లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తమ ట్రస్టు ద్వారా పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఆ ట్రస్టు ఛైర్మన్ ప్రసాద్ గుప్తా తెలిపారు. కష్టకాలంలో ఉన్న తమను ఆదుకున్నందుకు ప్రసాద్ గుప్తాకు ట్రాన్స్ టెండర్లు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి :కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ బృందం వివరణ