తెలంగాణ

telangana

ETV Bharat / state

ముస్లిం సోదరులకు రంజాన్​ శుభాకాంక్షలు తెలిపిన కొప్పుల - మంత్రి కొప్పుల ఈశ్వర్​ వార్తలు

మత సామరస్యానికి తెలంగాణ పెట్టింది పేరని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ అన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు.

రంజాన్​ శుభాకాంక్షలు తెలిపిన కొప్పుల ఈశ్వర్​
రంజాన్​ శుభాకాంక్షలు తెలిపిన కొప్పుల ఈశ్వర్​

By

Published : May 13, 2021, 5:48 PM IST

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముస్లిం సోదరులకు రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యానికి తెలంగాణ పెట్టింది పేరని అన్నారు. ఇస్లాం.. శాంతి, ప్రేమ, సోదర భావాన్ని ప్రభోదిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని మతాలు, కులాలను సమానంగా చూస్తున్నారని పేర్కొన్నారు.

గంగా-జమున తహజీబ్​గా పేరొందిన ఈ రాష్ట్రంలో.. ప్రజలందరి భద్రతకు, సంక్షేమానికి సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమం, అభ్యున్నతికి ఈ ఏడాది బడ్జెట్లో 1,606 కోట్లు కేటాయించామన్నారు. 204 గురుకులాల ద్వారా మైనార్టీలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు.

షాదీ ముబారక్ పథకాన్నిఅమలు చేస్తుండటంతో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గాయన్నారు. రంజాన్ సందర్భంగా 4 లక్షల 50 వేల మంది పేద ముస్లింలకు చీరలు, దుస్తులను అందించామని చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా సామూహిక విందులను ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందని.. ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరారు.

జామే నిజామియాలో రూ. 15కోట్లతో అత్యాధునిక ఆడిటోరియం... కోకాపేటలో 10 ఎకరాల్లో ఇస్లామిక్ కల్చరల్, కన్వెన్షన్ సెంటర్లు నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఐఎఎస్, ఐపీఎస్ సాధించాలనుకునే 100 మంది యువతకు వారు కోరుకున్న చోట శిక్షణ ఇప్పిస్తున్నామని... ముస్లిం సమాజం ఆచరించిన పవిత్ర ఉపవాస దీక్షలు, భక్తిప్రపత్తులతో జరిపే ప్రార్థనలతో కరోనా మహమ్మారి పీడ విరుగడ కావాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:కొవిడ్​ వార్డులో రోగులతో కలిసి నర్సుల డాన్సులు

ABOUT THE AUTHOR

...view details