తెలంగాణ

telangana

ETV Bharat / state

కోటి వృక్షార్చనలో పాల్గొన్న మంత్రి కొప్పుల

కేసీఆర్‌ 67వ జన్మదిన వేడుకలను... తెరాస శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుపుతున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా కోటి వృక్షార్చనలో పాల్గొని... తమ అభిమానాన్ని చాటుకున్నారు.

By

Published : Feb 17, 2021, 2:44 PM IST

minister koppula eshwar plantation on kcr birthday
కోటివృక్షార్చనలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన కోటివృక్షార్చనలో మంత్రి కొప్పుల ఈశ్వర్ భాగస్వాములయ్యారు. హైదరాబాద్​లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మొక్కలు నాటారు.

ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అధినేత జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని తెలిపారు. భావితరాలకు మనం ఇవ్వగల గొప్ప కానుక... పచ్చదనం, మంచి వాతావరణం, ఆరోగ్యకరమైన పర్యావరణమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కేసీఆర్​కు అరుదైన బహుమతి.. జోరుగా 'కోటి వృక్షార్చన'

ABOUT THE AUTHOR

...view details