రాష్ట్రంలో గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ పెద్దసంఖ్యలో గురుకులాలు నెలకొల్పారని తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ఏడో పాలకమండలి సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 121 మైనార్టీ గురుకుల పాఠశాలలను.. కళాశాలల స్థాయికి పెంచాలని మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థ పాలకమండలి తీర్మానించింది.
మైనార్టీ గురుకుల పాఠశాలల స్థాయి పెంపు: కొప్పుల - మంత్రి మహమూద్ అలీ
రాష్ట్రవ్యాప్తంగా 121 మైనార్టీ గురుకుల పాఠశాలల స్థాయి పెంచాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏడోసారి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని ఆయన అన్నారు.
జాతీయ పోటీ పరీక్షల్లో విద్యార్థులు సత్తా చాటేలా పది పాఠశాలలను సెంటర్‌ఫర్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనకు పాలకమండలి ఆమోదం తెలిపింది. మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు విద్యావంతులై జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్న సదాశయంతో ముఖ్యమంత్రి గురుకులాలను ప్రారంభించారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పాఠశాలలను గొప్పగా తీర్చిదిద్దుతున్న అధికారులు ప్రవీణ్ కుమార్, షఫీవుల్లాలను మంత్రులు అభినందించారు. జాతీయ స్థాయి క్రీడల్లో పతకాలు సాధించిన పదిమంది విద్యార్థులను సమావేశంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సలహాదారు ఏకేఖాన్, విద్యాధికారులు పాల్గొన్నారు.