కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొంటూ వైద్యులు విశేష సేవలు అందించడం అభినందనీయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా బాధితులను కాపాడారని ప్రశంసించారు. ఐఎస్‌ఎం ఎడ్యూటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి... వైరస్ బాధితులకు సేవలందించిన డాక్టర్లకు జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వైద్యుల విశేష సేవలు అభినందనీయం: మంత్రి కొప్పుల - హైదరాబాద్ లేటెస్ట్ న్యూస్
కరోనా వేళ వైద్యులు ప్రాణాలు పణంగా పెట్టి అందించిన సేవలు అభినందనీయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. ఐఎస్‌ఎం ఎడ్యూటెక్ సంస్థ ద్వారా విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసి... ఇక్కడ కొవిడ్ బాధితులకు సేవలందించిన డాక్టర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు.
వైద్యుల విశేష సేవలు అభినందనీయం: కొప్పుల
ఈ సంస్థ ద్వారా విదేశాల్లో వైద్య విద్యనభ్యసించిన సుమారు 50మందిని మంత్రి సన్మానించి మెమోంటోలు అందజేశారు.
ఇదీ చదవండి:'మాయా దీపం'తో 24 గంటలూ వెలుగులే