మైనార్టీ గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.. అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. మైనార్టీ సంక్షేమం, సంబంధిత అంశాలపై చర్చించారు. మైనార్టీల భద్రత, సంక్షేమం, సముద్ధరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు. దేశంలో మరెక్కడా లేని విధంగా బడ్జెట్లో రూ. 1,518 కోట్లు కేటాయించారని అన్నారు.
'మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది' - మంత్రి కొప్పుల ఈశ్వర్ వార్తలు
మైనార్టీల సంక్షేమం, సముద్ధరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో నగరంలో సమావేశం నిర్వహించారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్
గురుకులాల్లో సుమారు 50 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని, రోజురోజుకూ ఈ సంఖ్య పెరుగుతోందని అధికారులు మంత్రికి వివరించారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. జాతీయ పోటీ పరీక్షల్లో విద్యార్థులు మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. క్రైస్తవుల శ్మశానవాటికల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చదవండి:జీహెచ్‌ఎంసీ ఎన్నికల పరిశీలకుడిని నియమించిన ఎస్‌ఈసీ