గాంధీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ నుంచి మోతీ నగర్ ఎర్రగడ్డ చౌరస్తా వరకు ఆయన గాంధీ సంకల్పయాత్రను చేపట్టారు. గాంధీ కలలుగన్న స్వరాజ్యం సాధించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. భారతదేశంలో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. మోదీ ఆశయ సాధన కోసం తోడ్పడాలని సూచించారు. బోరబండలోని వివిధ బస్తీల్లో సుమారు ఏడు కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు.
గాంధీ ఆశయ సాధన ప్రతిఒక్కరి బాధ్యత: కిషన్రెడ్డి - మహాత్మాగాంధీ 150వ జయంతి
హైదరాబాద్లోని బోరబండ నుంచి మోతీనగర్ ఎర్రగడ్డ చౌరస్తా వరకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గాంధీ సంకల్పయాత్రను చేపట్టారు.
'గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి'