తెలంగాణ

telangana

ETV Bharat / state

అమరవీరుల స్ఫూర్తి కేంద్రం నిర్మించాలి: కిషన్​రెడ్డి - Telangana Liberation Day latest news

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా దిల్లీలో జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. 70 ఏళ్ల పోరాట చరిత్రకు గుర్తుగా అమరవీరుల స్ఫూర్తి కేంద్రం నిర్మించాలని కోరారు. ఆ స్పూర్తి కేంద్రం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని.. కనీసం తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయింపు చేస్తే చాలన్నారు.

minister kishan reddy said A martyr's' inspiration center should be built in telangana
అమరవీరుల స్ఫూర్తి కేంద్రం నిర్మించాలి: కిషన్​రెడ్డి

By

Published : Sep 17, 2020, 11:00 AM IST

Updated : Sep 17, 2020, 11:21 AM IST

అమరవీరుల స్ఫూర్తి కేంద్రం నిర్మించాలి: కిషన్​రెడ్డి

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా దిల్లీలో జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులు అర్పించారు.

"నిజాం రాజ్యంలో తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన రోజు. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన రోజు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం 1948 సెప్టెంబర్​ 17న వచ్చింది. స్వామి రామానాంద, చాకలి ఐలమ్మ, పీవీ వంటి ఎందరో నాయకులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణకు స్వాతంత్య్రం సాధించుకున్నారు. ఆ రోజుల్లో రక్తపాతం జరిగింది. అనేక మందిని చంపి బావుల్లో పడేశారు. అలాంటి ఈ రోజును కర్ణాటక, మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో ఉత్సవాలు అధికారికంగా నిర్వహిస్తున్నారు. కానీ రాష్ట్రంలో అధికారికంగా నిర్వహించడం లేదు. తెలంగాణ రాకముందు అధికారికంగా నిర్వహిస్తామన్న కేసీఆర్​.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు. ఇప్పుడు ఎందుకు నిర్వహించడం లేదో చెప్పాలి. నిజాం రాజ్యంలో తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన రోజు ఈరోజు. 70 ఏళ్ల పోరాట చరిత్రకు అమరవీరుల స్ఫూర్తి కేంద్రంను నిర్మించి భావితరాలకు భద్రపరచాలి. ఆ స్ఫూర్తి కేంద్రం నిర్మాణంకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. కనీసం తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయింపు చేస్తే.. అమరవీరుల స్ఫూర్తి కేంద్రం నిర్మిస్తాం.

- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

ఇదీ చూడండి :రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా మరణాలు

Last Updated : Sep 17, 2020, 11:21 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details