తెలంగాణ ప్రభుత్వం తమపై అకారణంగా నిందలు మోపుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెరాసపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తోందని... రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హిమాయత్‌నగర్‌లో జరిగిన భాజపా సెంట్రల్ జిల్లా పదాధికారుల సమావేశానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లక్ష్యాలు సాధించాలంటే క్యాడర్ మరింత కృషి చేయాలని కిషన్‌రెడ్డి సూచించారు.
నూతన సాగు చట్టాలతో రైతులకు స్వేచ్ఛ: కిషన్ రెడ్డి - హైదరాబాద్ జిల్లా భాజపా పదాధికారుల సమైవేశం
లక్ష్య సాధనకు పార్టీ శ్రేణులు మరింత శ్రమించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్ భాజపా సెంట్రల్ జిల్లా పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
నూతన సాగు చట్టాల ద్వారా రైతులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నారు. స్వలాభం కోసం కొందరు రైతులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఐకేపీ కేంద్రాలను ఎత్తివేయడం లేదని వెల్లడించారు. రైతులు సానుకూలంగా ఆలోచించాలని సూచించారు. నూతన విద్యా విధానంతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. మాతృభాషలోనే విద్యను ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్‌తో ఉపాధి అవకాశాలు పెంచామన్నారు.
ఇదీ చూడండి:'సేవాలాల్ మహరాజ్ హిందువులందరికీ ఆదర్శం'