స్థానిక సమస్యలు తెలుసుకుంటూ మహాత్ముని ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే గాంధీ సంకల్పయాత్ర ముఖ్య ఉద్దేశమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మహాత్ముని 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా భాజపా నేతలు గాంధీ సంకల్ప యాత్ర చేపట్టారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ యాత్రలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్, అవినీతి రహిత, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మోదీ పాటు పడుతున్నారని.. ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రజలు సహకరించాలని కిషన్రెడ్డి కోరారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఏడాది పాటు యాత్ర కొనసాగుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వివరించారు.
'గాంధీ ఆశయాలు చెప్తూ స్థానిక సమస్యలు తెలుసుకుంటాం' - హైదరాబాద్లో గాంధీ సంకల్ప యాత్ర 2019
మహాత్ముని 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ పిలుపుమేరకు హైదరాబాద్ చిక్కడపల్లిలో భాజపా నేతలు గాంధీ సంకల్ప యాత్ర చేపట్టారు. యాత్రలో స్థానిక సమస్యలు తెలుసుకుంటూ గాంధీ ఆశయాలను ప్రజలకు వివరిస్తామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు.
'గాంధీ ఆశయాలు చెప్తూ స్థానిక సమస్యలు తెలుసుకుంటాం'