తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ బంగారుపళ్లెం కాదు - అప్పుల కుప్పగా మార్చారు : జూపల్లి

Minister Jupally comments on BRS : బీఆర్ఎస్‌ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఇవాళ రూ.40,000ల కోట్లు వడ్డీలకే పోతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం బంగారుపళ్లెం కాదని, అప్పుల కుప్పగా ఉందని జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు.

Jupally Krishna Rao
Jupally Krishna Rao

By ETV Bharat Telangana Team

Published : Jan 19, 2024, 2:31 PM IST

ప్రజల్లో తిరుగుబాటు వచ్చే బీఆర్‌ఎస్‌ను ఓడించారు

Minister Jupally comments on BRS : ప్రజల్లో తిరుగుబాటు వచ్చే బీఆర్ఎస్‌ను ఓడించారని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) అన్నారు. భారత్ రాష్ట్ర సమితికి ప్రజలు వాత పెట్టి రెండు నెలలు కూడా కాలేదని వ్యాఖ్యానించారు. 2018 ఎన్నికలప్పుడు గులాబీ పార్టీ చాలా హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయనందుకే బీఆర్ఎస్‌ను ఓడించారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.

అప్పుల కుప్పగా తెలంగాణ : గతంలో విపక్షాలు బీఆర్ఎస్‌ను(టీఆర్ఎస్) రెండేళ్ల తర్వాత విమర్శిస్తే, రెండు సంవత్సరాల పసికందును విమర్శిస్తున్నారు అని ఆ పార్టీ నేతలు వాపోయారని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి నాయకులు రెండు నెలలు కూడా ఎందుకు ఆగలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం బంగారుపళ్లెం కాదని, అప్పుల కుప్పగా ఉందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో జీవోలను బహిర్గతం చేయలేదని, అన్నీ చీకటి జీవోలు ఇచ్చిందని జూపల్లి కృష్ణారావు ఆరోపించారు.

తొమ్మిదిన్నరేళ్ల అస్తవ్యస్త పాలనను చక్కదిద్దే ప్రయత్నం చేస్తాం : మంత్రి జూపల్లి

'బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పు చేసింది. ఇవాళ రూ.40,00ల కోట్లు వడ్డీలకే పోతోంది. బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకు పార్లమెంట్‌లో భారత్ రాష్ట్ర సమితి మద్దతు ఇచ్చింది. రాష్ట్రానికి పెట్టుబడుల కోసమే అదానీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలిశారు. గత రెండేళ్లలో కృష్ణా బేసిన్‌లో నిండుగా నీరు ఉన్నప్పటికీ సాగుకు నీరు ఇవ్వలేదు. ఈ ఏడాది వర్షాలు లేక నాగార్జునసాగర్‌లో జలాలు అడుగంటి పోయాయి. కృష్ణా బేసిన్‌లో నీరు లేనప్పుడు రెండో పంటకు నీరు ఇవ్వటం ఎలా సాధ్యమని' అన్నారు.

Jupally Krishna Rao on Six Guarantees :కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల్లో (Congress Six Guarantees) అప్పుడే రెండింటిని అమలు చేసిందని జూపల్లి కృష్ణారావు గుర్తు చేశారు. మిగతా హామీల అమలు కోసమే ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. దరఖాస్తుల పరిశీలన పూర్తికాగానే దశలవారీగా మిగతా గ్యారెంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వైఫల్యాలన్ని ప్రజలు అర్థం చేసుకునే కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని అన్నారు. వేల కోట్లు గుమ్మరించినా శాసనసభ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితిని తిరస్కరించారని జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు.

జుక్కల్‌లో మంత్రి జూపల్లి పర్యటన - కౌలస్‌కోటను అభివృద్ధి చేస్తామని హామీ

బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న స్నేహాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. భారత్ రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారు. బీఆర్‌ఎస్‌ను వీడటానికి ఇప్పటికే చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మేం ఆహ్వానిస్తే చాలామంది గులాబీ పార్టీ నేతలు కాంగ్రెస్‌లోకి వస్తారు. స్థానిక ప్రభుత్వాల్లో బీఆర్ఎస్‌ ప్రతినిధులే అవిశ్వాసాలు పెడుతున్నారు. - జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి

మల్లేశ్‌ హత్యను రాజకీయంగా వాడుకోవడం కేటీఆర్ స్థాయికి తగదు : మంత్రి జూపల్లి

'అక్రమ మైనింగ్ చేస్తే ఉపేక్షించేది లేదు' - మంత్రి జూపల్లి స్ట్రాంగ్ వార్నింగ్

ABOUT THE AUTHOR

...view details