ఆరేళ్లలో తెరాస చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొత్తపేట డివిజన్ అభ్యర్థి విద్యాసాగర్‌రెడ్డితో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. నగరంలో అల్లర్లు సృష్టించేందుకు భాజపా ప్రయత్నిస్తోందన్నారు. భాగ్యనగరంపై బాంబులతో దాడులు చేస్తారా అని మండిపడ్డారు.
దేశానికి నాయకత్వం వహించే సత్తా కేసీఆర్‌కు ఉంది: జగదీశ్ రెడ్డి - గ్రేటర్ ఎన్నికలు
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి జగదీశ్ రెడ్డి భాజపాపై విమర్శనాస్త్రాలు సంధిచారు. ప్రపంచ దేశాలను అక్కున చేర్చుకున్న హైదరాబాద్‌పై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా అని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొత్తపేట డివిజన్ తెరాస అభ్యర్థి విద్యాసాగర్‌రెడ్డి తరపున విస్తృత ప్రచారం నిర్వహించారు.
దేశానికి నాయకత్వం వహించే సత్తా కేసీఆర్‌కు ఉంది: జగదీశ్ రెడ్డి దేశానికి నాయకత్వం వహించే సత్తా కేసీఆర్‌కు ఉంది: జగదీశ్ రెడ్డి
తెరాస ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆయన అన్నారు. దేశానికి నాయకత్వం అందించే సత్తా కేసీఆర్‌కు ఉందని వెల్లడించారు. నగర శివారులో ఉంటున్న వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా రక్షణ కల్పించిందని మంత్రి తెలిపారు. భాజపా చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన కోరారు. ప్రచారంలో మంత్రితో పాటు భువనగిరి ఎమ్మెల్యే పెళ్ల శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.