రాష్ట్రంలో సౌరవిద్యుత్‌ను ప్రోత్సహించేందుకు 2015 సౌరవిద్యుత్ విధానాన్ని విడుదల చేసినట్లు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధనవనరులు ఉపయోగించి ప్రభుత్వం సాధించిన ఫలితాలను తెలపాలని అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానమిచ్చారు.
సౌరవిద్యుత్ ఉత్పత్తిలో మంచి ఫలితాలు సాధిస్తున్నాం: జగదీశ్‌రెడ్డి - minister jagadish reddy speech
సౌరవిద్యుత్ ఉత్పత్తిలో మంచి ఫలితాలు సాధిస్తున్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
![సౌరవిద్యుత్ ఉత్పత్తిలో మంచి ఫలితాలు సాధిస్తున్నాం: జగదీశ్‌రెడ్డి ప్రోత్సాహానికి 2015 సౌరవిద్యుత్ విధానం విడుదల: జగదీశ్‌రెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11106536-118-11106536-1616392729597.jpg)
ప్రోత్సాహానికి 2015 సౌరవిద్యుత్ విధానం విడుదల: జగదీశ్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 72 మెగావాట్ల సంప్రదాయేతర ఇంధనవనరులు ఉంటే... ఇవాళ 4,200 మెగావాట్లను రాష్ట్రం ఉత్పత్తిని చేస్తుందని వెల్లడించారు. రానున్న రోజుల్లో కూడా 3వేల మెగావాట్ల ఉత్పత్తికి వివిధ సంస్థలకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. రాబోయే రోజుల్లో అవసరాలకు సరిపడ ఇంధనవనరులు ఉన్నాయని స్పష్టం చేశారు. అన్ని రంగాలకు కూడా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ప్రోత్సాహానికి 2015 సౌరవిద్యుత్ విధానం విడుదల: జగదీశ్‌రెడ్డి
Last Updated : Mar 22, 2021, 12:26 PM IST