తెలంగాణ

telangana

'రాయదుర్గంలో మొట్టమొదటి గ్యాస్‌ ఇన్స్‌లేటెడ్ 400కేవీ సబ్‌స్టేషన్‌'

By

Published : Jan 19, 2022, 5:04 PM IST

Minister Jagadish Reddy: హైదరాబాద్​లోని రాయదుర్గంలో దేశంలోనే మొట్టమొదటి గ్యాస్‌ ఇన్స్​లేటెడ్ 400కేవీ సబ్‌స్టేషన్‌ను విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్​ సందర్శించి పనులను పరిశీలించారు. సబ్‌స్టేషన్‌ను త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి ప్రకటించారు.

Minister Jagadish Reddy:  'రాయదుర్గంలో మొట్టమొదటి గ్యాస్‌ ఇన్స్‌లేటెడ్  400కేవీ సబ్‌స్టేషన్‌'
Minister Jagadish Reddy: 'రాయదుర్గంలో మొట్టమొదటి గ్యాస్‌ ఇన్స్‌లేటెడ్ 400కేవీ సబ్‌స్టేషన్‌'

Minister Jagadish Reddy: 'రాయదుర్గంలో మొట్టమొదటి గ్యాస్‌ ఇన్స్‌లేటెడ్ 400కేవీ సబ్‌స్టేషన్‌'

Minister Jagadish Reddy: హైదరాబాద్ నగరంలో రాబోయే 30, 40సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రాయదుర్గంలో దేశంలోనే మొట్టమొదటి సారిగా నిర్మిస్తున్న గ్యాస్‌ ఇన్స్​లేటెడ్ 400కేవీ సబ్‌స్టేషన్‌ను మంత్రి సందర్శించి పనులను పరిశీలించారు. రూ.1400కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న గ్యాస్‌ ఇన్స్​లేటెడ్‌ సబ్‌స్టేషన్‌ను త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి ప్రకటించారు.

ఈ సబ్‌ స్టేషన్‌తో నగరానికి మరో 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేయవచ్చునని మంత్రి వివరించారు. దేశంలో మొదటిసారి మోనో పోల్స్‌ కూడా మనమే వాడుతున్నామని...టీఎస్‌ ట్రాన్స్​కో ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిందని.. పనులు కూడా చాలా వేగంగా జరిగాయన్నారు. కొవిడ్​తో పాటు అనేక ఆటంకాలు తట్టుకుని పనులు పూర్తి చేసినట్లు మంత్రి జగదీశ్‌ రెడ్డి స్పష్టం చేశారు.

గ్యాస్​ ఇన్స్​లేటెడ్​ సబ్​స్టేషన్..

సబ్​స్టేషన్ల నిర్మాణం ఒకే ప్రాంతంలో చేయడమనేది దీని ప్రత్యేకత. ఇది గ్యాస్​ ఇన్స్​లేటెడ్​ సబ్​స్టేషన్​. ఈ నాలుగు సబ్​స్టేషన్లు రావాలంటే దాదాపు 100 ఎకరాల స్థలం అవసరం అవుతుంది. కానీ నగర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 5 ఎకరాల్లోనే సబ్​స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాం. -జగదీశ్​ రెడ్డి, రాష్ట్ర మంత్రి

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details