ఏనాడైనా రైతులకు ఉపయోగపడే ఒక్క మంచి మాటైనా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారా మంత్రి జగదీశ్ రెడ్డి((Jagadeesh reddy fire on Bandi sanjay) ప్రశ్నించారు. ఆయన వైఖరిపై తెలంగాణ రైతులు మండిపడుతున్నారని అన్నారు. వరి ధాన్యం కొనలేమని కేంద్రం అంటే.. వరి తప్ప మరేది వేయొద్దని రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు.
బండి సంజయ్(bjp state president bandi sanjay) మరోసారి తెలంగాణ రైతులను మోసం చేసే కుట్ర చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. తెలంగాణలో ఇంత ధాన్యం వస్తుందా అని అవమానించేలా మాట్లాడారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దొడ్డు వడ్లను కేంద్రం కొంటుందా లేదా చెప్పాలని రైతులు అడుగుతున్నారని జగదీశ్ రెడ్డి అన్నారు. గత యాసంగి ధాన్యాన్ని కేంద్రం ఇంకా పూర్తిగా తీసుకోలేదన్నారు.
వారి నాటకాన్ని ప్రజలు గమనించాలి
రైతుల పట్ల కేంద్రం, భాజపా నేతల నాటకాన్ని ప్రజలు గమనించాలని మంత్రి జగదీశ్ రెడ్డి(minister jagadish reddy) సూచించారు. భాజపా నేతలకు రైతుల ప్రాణాలు, ప్రయోజనాలు పట్టవన్నారు. వందలాది రైతులను చంపేసి ఇప్పుడేమో క్షమాపణలు చెప్తున్నారని ఆరోపించారు. ఏ రకం వరి వేయాలో కేంద్రం, సంజయ్ స్పష్టంగా చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. యాసంగిలో ధాన్యం కొనేది లేదని కేంద్రం చెప్పిందన్నారు. కేంద్రం వద్దన్నందుకే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని తాము చెప్తున్నామని తెలిపారు. బండి సంజయ్‌కు వ్యవసాయంపై ఏ మాత్రం అవగాహన లేదన్నారు. సాగు గురించి ఏమీ తెలియని అజ్ఞాని బండి సంజయ్ మాత్రమే అని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల రైతులకు తీవ్రనష్టం జరుగుతోందని మంత్రి విమర్శించారు.
రైతుల నోట్లో మట్టి కొట్టే యత్నం
కేంద్రం, భాజపా నేతలు రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహాధర్నాలో ధాన్యం కొంటారా లేదా అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారని మంత్రి తెలిపారు. ఈ దేశ ప్రజల ప్రాణాలంటే భాజపాకు లెక్కలేకుండా పోయిందన్నారు. వందలాది మంది రైతులను చంపి ఒక్క క్షమాపణతో సరిపెడదామనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇకపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతామంటే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో తెరాస ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్‌బాబు, గొంగిడి సునీత, మెతుకు ఆనంద్, కంచర్ల భూపాల్ రెడ్డి ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డితో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: