Jagadish Reddy Fire On BJP And Congress: మునుగోడులో భాజపా ఓటమిని గ్రహించి.. రాజ్యాంగబద్ధ సంస్థలను వాడుకుంటూ అక్రమాలకు పాల్పడుతోందని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. చండూరులో సీఎం కేసీఆర్ సభతో ఓటమిపై భాజపాకు స్పష్టత వచ్చిందన్నారు. చైతన్యవంతమైన మునుగోడు ప్రజలు సరైన ఫలితాలు ఇస్తారని చెప్పారు. మునుగోడు ప్రజలకు ప్రయోజనం కలిగే ఒక్క మాట కూడా భాజపా చెప్పలేదని విమర్శించారు. భాజపాకు చిత్తశుద్ధి ఉంటే 15 రోజుల్లో కృష్ణా జలాల వాటా తేలుస్తామని చెప్పాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.
'భాజపా రాజ్యాంగబద్ధ సంస్థలను వాడుకుంటూ అక్రమాలకు పాల్పడుతోంది' - telangana politics
Jagadish Reddy Fire On BJP And Congress: మునుగోడు ఉపఎన్నికలో భాజపా ఓటమి తథ్యమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మునుగోడులో గెలిచేది తమ ప్రభుత్వమేనని.. అది చండూరులో నిర్వహించిన కేసీఆర్ సభతో స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. భాజపా రాజ్యాంగబద్ధ సంస్థలను వాడుకుంటూ అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు.
కాంగ్రెెస్, భాజపా ఒక్కటే: మంత్రి జగదీశ్ రెడ్డి..
కేసీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం కేంద్రానికి ఉందా అని ప్రశ్నించారు. అలాగే కాంగ్రెస్ పార్టీని జోడించలేని రాహుల్ గాంధీ దేశాన్ని జోడించేందుకు బయలుదేరారని ఆరోపించారు. రాహుల్ కాంగ్రెస్ను బలోపేతం చేయాలనుకుంటే.. గుజరాత్ కు ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. కాంగ్రెస్, భాజపా రెండూ ఒక్కటేనని.. మోదీ బీ టీం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. భాజపా ఇప్పటికైనా మునుగోడుకు 18వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: