శ్రీశైలం ప్రమాదంపై ఇప్పుడే ఏమి చెప్పలేమని... ప్రస్తుతం కేసు పురోగతిలో ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఘటనపై సీఐడీ విచారణతోపాటు అంతర్గత విచారణకు కూడా అయిదుగురు సభ్యులతో కమిటీ వేశామని వెల్లడించారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పాం... కానీ కమిటీలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. అందుకే ఆలస్యం జరిగింది.
''ప్రమాదం మీద మీకు ఏమి సందేహాలున్నాయో.. అవి అందరిలోనూ ఉన్నాయి. ప్రమాద సమయంలో నేను అక్కడే ఉన్నాను. చాలా ప్రయత్నం చేశాము... కానీ వారిని రక్షించడం సాధ్యం కాలేదు. ఇలాంటి ఘటన గతంలో ఎక్కడ జరగలేదు. ప్రమాదాలు జరిగి... రియాక్టర్లు పేలి, అగ్నికి ఆహుతై ప్రాణాలు విడిచిన వారిన చూశాం కానీ... ఇలా పొగ కారణంగా ప్రాణాలు వదిలిన ఘటన ఇదే తొలిసారి.''