రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ నానాటికి పెరిగి పోతుందని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినప్పటికీ సరఫరాలో అంతరాయం కలుగకుండా అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
విద్యుత్తు ఛార్జీల పెంపుపై కసరత్తు! - MINISTER JAGADEESHWAR REDDY REVIEW MEETING ON POWER
హైదరాబాద్‌లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షాసమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్‌కి అనుగుణంగా... సరఫరాలో ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.
MINISTER JAGADEESHWAR REDDY REVIEW MEETING ON POWER
గతేడాది ఆగస్టు 30 నాటికి గరిష్ఠంగా 11,703 మెగావాట్ల డిమాండ్ నమోదైందని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు 11,500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైందన్నారు. 13,000 మెగావాట్లకు విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున సాంకేతికంగా ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా చూడాలని మంత్రి కోరారు.
ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం
Last Updated : Jan 30, 2020, 9:06 AM IST