తెలంగాణ

telangana

ETV Bharat / state

'పార్టీలో ఎలాంటి సమస్య వచ్చినా ప్రణబ్‌కే అప్పగించేవారు' - శాసనసభ సమావేశాలు 2020

తెలంగాణ శాసససభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మంత్రి జగదీశ్​రెడ్డి ప్రణబ్​ ముఖర్జీ మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

minister jagadeesh reddy
minister jagadeesh reddy

By

Published : Sep 7, 2020, 12:53 PM IST

కాంగ్రెస్​ పార్టీలో ఎలాంటి సమస్య వచ్చినా ప్రణబ్‌కే అప్పగించేవారని మంత్రి జగదీశ్‌రెడ్డి శాసనసభలో పేర్కొన్నారు. తెలంగాణ సమస్యను ఎప్పుడూ ప్రణబ్‌కే అప్పగించేవారని గుర్తు చేశారు. లక్ష్య సాధనకు ఓపిక అవసరమని కేసీఆర్ చెప్పేవారని తెలిపారు. ప్రణబ్‌ను చూసి అనేక విషయాలు నేర్చుకోవచ్చని కేసీఆర్ అనేవారని చెప్పారు. తెలంగాణ వచ్చాక ప్రణబ్‌ వద్దకు వెళ్లామని అన్నారు.

ప్రొటోకాల్ నిబంధనలు పక్కనపెట్టి మరీ కేసీఆర్‌ను అభినందించారని జగదీశ్‌రెడ్డి శాసనసభలో తెలిపారు. ఉద్యమం ప్రారంభించి, సాధించిన కొద్దిమందిలో ఒక్కడివని కేసీఆర్‌ను పొగిడారని గుర్తు చేశారు. అభివృద్ధికి నమూనాలాగా తెలంగాణ మారుతోందని వివరించారు.

'పార్టీలో ఎలాంటి సమస్య వచ్చినా ప్రణబ్‌కే అప్పగించేవారు'

ఇదీ చూడండి: రాజకీయ సముద్రాన్ని సమర్థంగా ఈదిన నేత.. ప్రణబ్‌: కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details