'త్వరలో మరో తిరుపతిలా.. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం' యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని (Yadadri Lakshmi Narasimha Swamy Temple) మరో తిరుపతిలా (tirupathi) ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) పునర్నిర్మాణానికి ఆదేశించినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) శాసనమండలిలో పేర్కొన్నారు. త్వరలో దేశంలోనే ప్రసిద్ధి ఆలయమవుతుందని స్పష్టం చేశారు. ఎక్కడా లేని విధంగా కృష్ణ శిలతో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. గూడెంలోని సత్యనారాయణ స్వామి ఆలయ పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. గంగాపూర్ దేవాయలం కూడా చాలా ప్రసిద్ధమైందన్న మంత్రి... అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 13వేల ఆలయాలు ఉన్నాయని వివరించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పునర్నిర్మిస్తున్నారు. దేశంలోనే ప్రసిద్ధి ఆలయం అవుతుంది. గూడెంలోని సత్యనారాయణ స్వామి ఆలయ పనులు కూడా త్వరలో పూర్తి చేస్తాం. గంగాపూర్ దేవాలయం చాలా ప్రసిద్ధమైంది. అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. 13వేల దేవాదాయలు దేవాదయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి.
- ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి
బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయ పనుల కోసం.. కేసీఆర్ 50 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. ఇప్పటికే 8 కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణం, పలు సౌకర్యాలు కల్పించినట్లు ప్రకటించారు. బాసర ఆలయానికి చుట్టు పక్కల రాష్ట్రాల వారు కూడా అక్షరాభ్యాసం కోసం వస్తారని తెలిపారు. మరోవైపు భద్రాద్రి దేవాలయ పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. కేంద్రం నుంచి ఇటీవల ప్రసాదం స్కీమ్ కింద 50 కోట్ల రూపాయలు మంజూరైనట్లు స్పష్టం చేశారు. భద్రాచలంలోని మన 5 గ్రామాలు ఆంధ్రలో కలిపినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో వివరించినట్లు గుర్తుచేశారు. వాటిని ఎలాగైనా మన రాష్ట్రంలో కలుపుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ పేర్కొన్నారు. దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రజలు కూడా చూసుకోవాలని సూచించారు. దేవాలయం భూములన్నీ దేవుడి పేరుమీదే ఉండాలన్నారు. కొన్ని కోట్ల వ్యవహారం అయినందున కొంత సమయం పడుతుందని వివరించారు.
భద్రాద్రి దేవాలయం అభివృద్ధి గురించి.. 100 కోట్లు అడిగారు. కేంద్రం ఇటీవల ప్రసాద స్కీమ్‌లో భాగంగా 50 కోట్లు మంజూరయ్యాయి. భద్రాచలంలో ఉన్న 5 గ్రామలను ఆంధ్రలో కలిపారు. వాటిని మన దాంట్లో కలుపుకోవాలి. దేవాలయ భూములను ప్రజలు కూడా కాపాడాలి.
- ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి
ఇదీ చదవండి :Telugu akademi scam 2021 : 'ఫిబ్రవరిలోనే ఎఫ్డీలు కాజేసేందుకు యత్నం!'