రాజకీయాల్లో అందరి గౌరవం పొందిన వ్యక్తి.. ప్రణబ్ ముఖర్జీ అని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శాసనసభలో పేర్కొన్నారు. కేంద్రంలో వివిధ శాఖల్లో ప్రణబ్ సమర్థంగా పనిచేశారని అన్నారు. ప్రణబ్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు దాని బడ్జెట్ పెంచారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్ కీలకపాత్ర పోషించారని తెలిపారు.
తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర ప్రణబ్‌దే: ఇంద్రకరణ్‌రెడ్డి - Minister Indra karan Reddy speech
తెలంగాణ శాసనసభ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సంతాపం తెలిపారు. గొప్ప నేతను దేశం కోల్పోయిందని పేర్కొన్నారు. రాజకీయాల్లో అందరి గౌరవం పొందిన వ్యక్తి.. ప్రణబ్ ముఖర్జీ అని కొనియాడారు.
తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర ప్రణబ్‌దే: ఇంద్రకరణ్‌రెడ్డి
తెలంగాణ డిమాండ్ న్యాయమైందని ప్రణబ్ చెప్పేవారని శాసనసభలో ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ప్రజలు ప్రణబ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటారని పేర్కొన్నారు. యాదాద్రి వచ్చినప్పుడు ప్రణబ్‌కు నేనే స్వాగతం పలికానని వివరించారు.
ఇదీ చూడండి: రాజకీయ సముద్రాన్ని సమర్థంగా ఈదిన నేత.. ప్రణబ్: కేసీఆర్