కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఉగాది పంచాగ శ్రవణాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయంలోనే నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శ్రీరామ నవిమి పండుగ సందర్భంగా భద్రాద్రిలో నిర్వహించే సీతారాముల కల్యాణానికి భక్తులను ఆహ్వానించడం లేదని ఆయన తెలిపారు. భక్తులందరూ ఇంట్లోనే ఉండి టీవీల్లోనే స్వామివారి కల్యాణాన్ని వీక్షించాలని విజ్ఞప్తి చేశారు.
'సీతారాముల కల్యాణాన్ని టీవీల్లోనే చూడాలి' - ష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయంలోనే ఉగాది పంచాగ శ్రవణం
కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ఉగాది పంచాగ శ్రవణాన్ని కూడా రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయంలోనే నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అలాగే శ్రీరామ నవమి రోజు భద్రాచలంలో జరిపే స్వామి వారికి కల్యాణానికి భక్తులు ఎవరూ రావొద్దని పేర్కొన్నారు.
'సీతారాముల కల్యాణాన్ని టీవీల్లోనే చూడాలి'
అంతేకాకుండా కోరిన భక్తుల కోసం ప్రత్యేకంగా స్వామి వారి అక్షితల్ని ప్యాక్ చేసి తమ ఇళ్ల వద్దకే పంపే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు దేవాలయాల్లో సుదర్శన, మృత్యుజయ యాగం చేయిస్తున్నట్లు అల్లో ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.