Minister Indrakaran Reddy: కాళేశ్వరం ప్రాజెక్టు 27, 28 ప్యాకేజీ, సదర్మట్ ఆనకట్ట పనులకు అనుమతుల విషయంలో అటవీశాఖ నిర్లక్ష్యంపై ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ అరణ్యభవన్‌లో నీటిపారుదల, అటవీ శాఖల ఉన్నతాధికారులతో పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. 27వ ప్యాకేజీలోని మూడో యూనిట్ పనులను జూన్ లోపల పూర్తి చేసి చెరువులను నింపి ఖరీఫ్‌లో 1500 ఎకరాలకు, వివిధ తూముల ద్వారా 600 ఎకరాలకు సాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 2022 డిసెంబర్ నాటికి 18వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఆదేశించారు.
అధికారులపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అసహనం! - ts news'
Minister Indrakaran Reddy: అటవీ శాఖ నిర్లక్ష్యంపై ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నీటిపారుదల, అటవీశాఖల్లో పలు పనుల పురోగతిపై సమీక్షించిన మంత్రి.. పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించి.. త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి నుంచి మామడ మండలం దిమ్మదుర్తి వరకు 19 కిలోమీటర్ల మేర కాల్వ తవ్వకం పనులను ఆగస్టులోగా పూర్తిచేయాలని గడువు విధించారు. 28వ ప్యాకేజీ పనులకు సంబంధించి భూసేకరణలో జాప్యం, గుత్తేదారు అలసత్వం వల్ల పురోగతి లేదని ఇంద్రకరణ్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత గుత్తేదారుకు ఇచ్చిన కాంట్రాక్టును రద్దుచేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు వివరించారు. ప్రభుత్వ ఆమోదం పొందిన వెంటనే వేరే టెండర్లు పిలిచి కొత్త గుత్తేదారుకు పనులు అప్పగించాలని మంత్రి ఆదేశించారు. సదర్మట్ ఆనకట్ట పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, 55 గేట్లను బిగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. వర్షాకాలంలోగా గేట్ల బిగింపు పనులు పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందించేలా చూడాలని ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. నిర్మల్ నియోజవర్గంలో రూ.89 కోట్లతో నిర్మించనున్న 15 చెక్‌డ్యాంల నిర్మాణానికి త్వరగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: