తెలంగాణ

telangana

ETV Bharat / state

నెహ్రూ జులాజికల్​ పార్క్‌ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి - Nehru Zoological Park latest news

నెహ్రూ జులాజికల్ పార్క్‌ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను మంత్రి ఇంద్రక‌ర‌ణ్‌ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రం, సెంట్రల్‌ జూ అథారిటీ అనుమతి తర్వాతే సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. వెబ్‌సైట్‌, యాప్‌లో జంతువుల దత్తత వివరాలు, టికెట్లు బుకింగ్‌ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

Minister indrakaran reddy launch of the nehru park website and mobile app
ఆ పార్క్‌ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి

By

Published : Jun 6, 2020, 5:22 AM IST

నెహ్రూ జంతు ప్రదర్శనశాల వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను.. అట‌వీశాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డి ఆవిష్కరించారు. నెహ్రూ జులాజిక‌ల్ పార్క్‌కు సంబంధించిన స‌మ‌గ్ర స‌మాచారాన్ని.. ఇందులో పొందుప‌రిచార‌ని తెలిపారు. జంతు ప్రేమికులు కూడా... జంతువుల దత్తత వివ‌రాలను ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవ‌చ్చని పేర్కొన్నారు.

సంద‌ర్శకులు ఆన్‌లైన్‌లో జంతు ప్రదర్శనశాల ప్రవేశ‌ టిక్కెట్లతోపాటు... ఇత‌ర సేవ‌ల‌ను బుక్ చేసుకోవ‌చ్చని వివరించారు. సెంట్రల్ జూ అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం సంద‌ర్శకుల‌కు అనుమతిచ్చిన‌ తర్వాతే... ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి :ఓవైపు సిబ్బందితో శ్రమదానం.. మరో వైపు ఆదాయం

ABOUT THE AUTHOR

...view details