Nehru zoo park : హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో రూ.1.33కోట్లతో నూతనంగా పక్షుల ఎవియరీని ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. ఈ ఎన్‌క్లోజర్లలో ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లో కనిపించే అరుదైన పక్షిజాతికి చెందిన 680రకాల పక్షులు ఇందులో ఉంచామని మంత్రి తెలిపారు. జంతు ప్రదర్శనశాలకు వచ్చే సందర్శకుల కోసం ఎప్పటికప్పుడు నూతన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
సీసీ కెమెరాల ఏర్పాటు
minister indrakaran reddy: జంతు ప్రదర్శనశాలలో భద్రత వ్యవస్థను మెరుగుపరచడం, నిరంతర పర్యవేక్షణ, సందర్శకుల కదలికలు, జంతువుల ప్రవర్తనపై అధ్యయనం కోసం 200సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని మంత్రి స్పష్టం చేశారు. రెండో దశలో మరో 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. సెంట్రల్ జూ అథారిటీ, జపాట్ నిధులతో 1.6 కోట్లు వెచ్చించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.