జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస గెలుపును ఎవరూ ఆపలేరని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై తెరాసకు ఉన్న పట్టింపు ఇతర పార్టీలకు లేదని తెలిపారు. బంజారాహిల్స్ డివిజన్ తెరాస అభ్యర్థి గద్వాల విజయలక్ష్మీ తరఫున అల్లోల దివ్యారెడ్డితో కలిసి ఆయన పాదయాత్ర చేశారు. ఎన్బీటీ నగర్‌లో ఇంటింటికీ తిరుగుతూ తెరాసకు ఓటు వేయాలని ఆయన కోరారు.
తెరాస విజయాన్ని ఎవరూ ఆపలేరు: ఇంద్రకరణ్ రెడ్డి - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌తోనే అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. బంజారాహిల్స్ డివిజన్ తెరాస అభ్యర్థి గద్వాల విజయలక్ష్మీకి తరఫున ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
తెరాస విజయాన్ని ఎవరూ ఆపలేరు: మంత్రి ఇంద్రకరణ్
భాజపా మాటలను ప్రజలు నమ్మరని... కేసీఆర్‌తోనే అభివృద్ది జరుగుతుందని మంత్రి వివరించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తున్నామని, హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు. హైదరాబాద్‌కు పెట్టుబడులు రాకుండా మహా నగరంలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో విపక్షాలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
ఇదీ చదవండి:కేసీఆర్ చిత్రపటానికి ట్రావెల్స్ యజమానుల పాలాభిషేకం
Last Updated : Nov 24, 2020, 2:18 PM IST
TAGGED:
ghmc elections 2020