ఉమ్మడి రాష్ట్రంలో నీటి కోసం, కరెంటు కోసం... ఎన్నో కష్టాలు పడ్డామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కరెంటు సమస్య, నీటి సమస్యలు అధిగమించామని వెల్లడించారు.
'కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ' - Minister Indira Reddy planted the plants In the Botanical Garden
గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్లో అటవీశాఖ అధికారులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మొక్కలు నాటారు.
!['కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ' మొక్కలు నాటిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10659533-634-10659533-1613544439952.jpg)
మొక్కలు నాటిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా పురస్కరించుకుని ఎంపీ సంతోష్ కుమార్ వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్లో అటవీశాఖ అధికారులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హరితహార కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 210 కోట్ల మొక్కలు నాటామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో బతకాలని ఆకాంక్షించారు.