తెలంగాణ

telangana

ETV Bharat / state

'పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం' - minister harish rao news

Super Speciality hospital at Alwal: హైదరాబాద్​ నలువైపులా సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలిలో ఇప్పటికే టిమ్స్​ అందుబాటులో ఉండగా సనత్​ నగర్​, అల్వాల్​, ఎల్బీనగర్​ ప్రాంతాల్లో ఆస్పత్రులు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు అల్వాల్​లో సేకరించిన స్థలాన్ని మంత్రులు హరీశ్​ రావు, మల్లారెడ్డి పరిశీలించారు.

Super Speciality hospital at Alwal
మంత్రి హరీశ్​ రావు

By

Published : Apr 24, 2022, 2:48 PM IST

Updated : Apr 24, 2022, 2:58 PM IST

Super Speciality hospital at Alwal: రాష్ట్రంలో పేదలకు అత్యాధునిక వసతులతో మెరుగైన వైద్యం అందించటమే లక్ష్యంగా తెరాస సర్కార్ కృషి చేస్తోందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​ రావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే... హైదరాబాద్​ శివారుల్లో మూడు మల్టీస్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణానికి నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. అల్వాల్​తో పాటు పరిసర ప్రాంత ప్రజలకు వైద్యసేవలందించేందుకు ప్రభుత్వం నిర్మించతలపెట్టిన వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణానికి సేకరించిన స్థలాన్ని మంత్రి మల్లారెడ్డితో కలిసి హరీశ్​రావు పరిశీలించారు.

ఈ నెల 26న ఈ ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు మంత్రి హరీశ్​రావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. 1000 పడకల ఆస్పత్రి నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎర్రగడ్డ, గడ్డి అన్నారంలలో కూడా త్వరలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు జరుగుతాయని వెల్లడించారు.

Last Updated : Apr 24, 2022, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details