harish tweet on Osmania: సికింద్రాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి అందిస్తున్న ఆధునిక వైద్యసేవలపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే వైద్యాన్ని ప్రభుత్వం ఆస్పత్రుల్లో ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ దార్శనికత, ముందుచూపు వల్లే ఇది సాధ్యమైందని హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అత్యాధునిక వైద్య సేవలందిస్తున్న ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర, ఆస్పత్రి సిబ్బందిని అభినందించారు. ఈనాడు పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన ట్వీట్‌కు జతచేశారు.
ఉస్మానియాలో గత 6 నెలల్లోనే 50 కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు. కేవలం రెండు నెలల్లోనే 250 హృద్రోగ చికిత్సలు నిర్వహించారని పేర్కొన్నారు. త్వరలోనే ఉస్మానియాలో మాడ్యులార్ ఆపరేషన్ థియేటర్లు ఆధునీకీకరణ పనులు పూర్తి కానున్నాయని వివరించారు. ఈ ఆత్యాధునిక వైద్యసేవలు పేదలకు అందుబాటులోకి వస్తాయని హరీశ్ రావు తెలిపారు.