రాష్ట్రంలో త్వరతో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకు రాబోతున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ చట్టం జవాబుదారితనంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడంలేదని... అయినప్పటికీ మిగతా రాష్ట్రాల కంటే బాగానే ఉన్నామని వెల్లడించారు. హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని ఫెడరేషన్ ఛాంబర్ కార్యాలయంలో విజన్ తెలంగాణ అంశంపై జరిగిన ఇష్టాగోష్ఠిలో పాల్గొని... పలువురి ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
త్వరలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తాం: మంత్రి హరీశ్‌రావు
రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని త్వరలో తీసుకురాబోతున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ ఛాంబర్ కార్యాలయంలో విజన్ తెలంగాణ అంశంపై జరిగిన ఇష్టాగోష్ఠిలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దేశంలోనే తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా మారిందని హరీశ్ పేర్కొన్నారు. మంజీర, గోదావరి, కృష్ణా నదుల నీళ్లను సద్వినియోగం చేసుకోగలిగామని చెప్పారు. ప్రజల కనీస అవసరాలను తెలంగాణ ప్రభుత్వం తీర్చిందని వివరించారు. గతంలో మహారాష్ట్రలోని విదర్భ, తెలంగాణలో ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగేవి... గడిచిన ఐదేళ్లలో రైతుల ఆత్మహత్యలు నిరోధించగలిగినట్లు తెలిపారు. హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ఆవిర్భవించిందని... ఆరోగ్య శ్రీ కొనసాగిస్తూ కేసీఆర్ కిట్లు నిరుపేద మహిళలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు హరీశ్ రావు తెలిపారు.
ఇదీ చూడండి: త్వరలో లోకాయుక్త, మానవ హక్కుల సంఘాల ఏర్పాటు