ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంభిస్తున్న... దార్శనికత, అవినీతి రహిత పరిపాలన, పటిష్ఠమైన ఆర్థిక విధానాలతో తెలంగాణ బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. 2022-23 బడ్జెట్ బడుగుల జీవితాలను మార్చే వార్షిక పద్దు అని... కేసీఆర్ మార్క్ బడ్జెట్ అని హరీశ్‌రావు అన్నారు.
శాసనసభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా.. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఈ పద్దును ప్రతిపాదించినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్రం బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగింది. 2022-23 బడ్జెట్ బడుగుల జీవితాలను మార్చే బడ్జెట్. ఇది ముమ్మాటికి కేసీఆర్ మార్కు బడ్జెట్.