సాగునీటి రంగంపై సీఎం కేసీఆర్ ప్రధానంగా దృష్టి పెట్టారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ తెలిపారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని ఎన్నోసార్లు అడిగామని అసెంబ్లీలో చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు డీపీఆర్ లేదని విపక్ష నేతలు అంటున్నారని.. ప్రాజెక్టుకు డీపీఆర్ లేకుండా కేంద్ర అనుమతులు వస్తాయా? అని ప్రశ్నించారు. అంచనాలు పెరగడాన్ని కూడా విపక్ష నేతలు తప్పు పడుతున్నారని.. రూ.102 కోట్ల అంచనాతో నాగార్జుసాగర్ ప్రాజెక్టును చేపడితే రూ.వెయ్యి కోట్లకు పైగా ఖర్చు అయిందన్నారు.
డీపీఆర్ లేకుండానే కాళేశ్వరానికి అనుమతులొచ్చాయా?: హరీశ్ - kaleshwaram project latest news
కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని ఎన్నోసార్లు అడిగామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శాసనసభలో పేర్కొన్నారు. డీపీఆర్ లేకుండానే కాళేశ్వరానికి అనుమతులొచ్చాయా? అని ప్రశ్నించారు. జాతీయహోదాపై కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు.
గతంలో కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చు కూడా 800 నుంచి 1000 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. కాళేశ్వరం సామర్థ్యాన్ని 16 టీఎంసీల నుంచి 140 టీఎంసీలకు పెంచామని.. రూ.17 వేల కోట్ల నుంచి రూ.38 వేల కోట్లకు కాంగ్రెస్ ప్రభుత్వమే పెంచింది గుర్తు చేశారు. సాగునీటి రంగంపై చేస్తున్న ఖర్చు జాతీయ స్థాయి కంటే అధికమన్నారు. వేసవిలోనూ చెరువులు మత్తడి పోస్తున్నాయని తెలిపారు. 2014 నాటికి 23.44 లక్షల ఎకరాలు మాత్రమే సాగులో ఉందని.. ప్రస్తుతం సాగుభూమి 90 లక్షల ఎకరాలకు పెరిగిందని వెల్లడించారు. యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల విలువ రూ.లక్ష కోట్లు దాటిందని హరీశ్ రావు పేర్కొన్నారు.