తెలంగాణ

telangana

ETV Bharat / state

దేవుళ్లను కించపరిస్తే.. తెరాస ప్రభుత్వం ఊరుకోదు: హరీశ్ - minister harish rao speech

గోదావరి నదికి కరకట్ట నిర్మాణంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు శాసనమండలిలో తెలిపారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు ఆసరా పెన్షన్‌లను త్వరలో ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

minister harish rao , Legislative Council
హరీశ్​రావు

By

Published : Mar 26, 2021, 7:09 PM IST

భద్రాచలం వద్ద గోదావరి నదికి కరకట్ట నిర్మాణం పనులను వేగంగా పూర్తి చేస్తామని... ఈ నది పరివాహ ప్రాంతమైన మంగపేట వద్ద కట్ట నిర్మాణంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు. మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు ఆసరా పెన్షన్‌లను త్వరలో ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థలను భాజపా అమ్ముతుంటే తాము ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తున్నామని వివరించారు. ఎవరి దేవుళ్లను కించపరిచినా... తెరాస ప్రభుత్వం ఊరుకోదని.. రాముడు అందరివాడని, ఏ కొందరికో, ఏ ఒక్క పార్టీకో చెందిన దేవుడు కాదని స్పష్టం చేశారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను పెంచి జనాలకు వాత పెడుతోందని ఆరోపించారు.

ఇదీ చూడండి: ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించం: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details