జూన్ నెల నుంచి పూర్తి జీతాలు, పింఛన్లు ఇవ్వటానికి ఆర్థిక మంత్రి హరీశ్ రావు అంగీకరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక నాయకులు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. జూన్ నెల వేతనాలు పూర్తిగా ఇవ్వాలని, 3 నెలల బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ జూన్ నెల నుంచి పూర్తి వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వడానికి మంత్రి అంగీకరించారు. అదేవిధంగా బకాయిలకు సంబంధించి జీపీఎఫ్‌లో జమ చేయాలనుకుంటున్నామని చెప్పారు.
'జూన్ నెల నుంచి పూర్తి జీతాలు, పింఛన్లు' - జూన్ నెల నుంచి పూర్తి జీతాలు
మంత్రి హరీశ్‌రావును కలిసిన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక జూన్ నెల వేతనాలు పూర్తిగా ఇవ్వాలని, 3 నెలల బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. జూన్ నెల నుంచి జీతాలు, పింఛన్లు ఇవ్వడానికి ఆర్థిక మంత్రి హరీశ్ రావు అంగీకరించారు. బకాయిలను వాయిదాలలో ఇవ్వడానికి ఆలోచిస్తున్నామని మంత్రి తెలిపారు.
సీపీఎస్, పెన్షనర్లకు ఎలా ఇస్తారని ప్రస్తావించినప్పుడు.. వారి బకాయిలు వాయిదాలలో ఇవ్వడానికి ఆలోచిస్తున్నామని మంత్రి అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన బకాయిలు కూడా జీపీఎఫ్‌లో కాకుండా నగదు రూపంలోనే ఇవ్వాలని మంత్రి హరీశ్ రావును ఐక్యవేదిక పక్షాన కోరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు సీహెచ్ సంపత్ కుమార్ స్వామి, జి.సదానందంగౌడ్, కె.జంగయ్య, చావ రవి, వెంకటరెడ్డి, బి.రామకృష్ణ, ఎస్.విఠల్, పి.పురుషోత్తం పాల్గొన్నారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని వసంత్ వ్యాలీ నివాసంలో మంత్రి హరీశ్ రావును కలిసినట్లు తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో నూతన క్రీడా విధానం: మంత్రి శ్రీనివాస్ గౌడ్