తెలంగాణ

telangana

ETV Bharat / state

త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 1,500 పల్లె దవాఖానాలు: మంత్రి హరీశ్‌రావు

పేదలకు వైద్య సౌకర్యాలు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా మరో 1,500 వరకు పల్లె దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రెండు, మూడో వారాల్లో పీహెచ్‌సీలలో వైద్యులను నియమిస్తామని స్పష్టం చేశారు.

harish
harish

By

Published : Nov 11, 2022, 7:28 PM IST

దేశంలోనే తొలిసారిగా పీహెచ్‌సీల పనితీరును అనుక్షణం పరిశీలించేందుకు వీలుగా మానిటరింగ్ హబ్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హబ్ ప్రారంభోత్సవంలో మంత్రితో పాటు డీహెచ్ శ్రీనివాసరావు, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్వేతా మహంతి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీల పనితీరును పరిశీలించడంతో పాటు హబ్‌లో ఏర్పాటు చేసిన వీడియో కాల్ సౌకర్యం ద్వారా వైద్యులకు అధికారులు ఎప్పటికప్పుడు తగు సూచనలు, స్పెషలిస్ట్ వైద్యుల సహాయం అందించేందుకు వీలు కల్పించినట్టు అయిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 887 పీహెచ్‌సీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు హరీశ్‌రావు వివరించారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో వైద్యుల నియామక ప్రక్రియ ఆలస్యం అయిందన్న మంత్రి.. మరో వారం రోజుల్లో దానిని పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 1500 వరకు పల్లె దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ఆయన.. త్వరలోనే 1,165 స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు కేంద్రం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇచ్చినా.. అందులో తెలంగాణకు ఒక్కటీ దక్కలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్‌ కాలేజీ ఇప్పుడు ఇచ్చినా స్వీకరిస్తామని.. అందుకోసం అవసరమైతే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని తానే స్వయంగా కలవడానికి సిద్ధంగా ఉన్నానని వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా 887 పీహెచ్‌సీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో వైద్యుల నియామక ప్రక్రియ ఆలస్యం అయింది. మరో వారం రోజుల్లో దానిని పూర్తి చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 1500 వరకు పల్లె దవాఖానాలు ఏర్పాటు చేయనున్నాం. త్వరలోనే 1,165 స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నాం. - హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి

త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 1,500 పల్లె దవాఖానాలు: మంత్రి హరీశ్‌రావు

ABOUT THE AUTHOR

...view details