Telangana Budget 2023-24: రాష్ట్రంలో తొలిసారిగా రూ.2,90,396 కోట్లతో బడ్జెట్ రూపొందించారు. ఎన్నికల సంవత్సరంలో ప్రవేశపెడుతున్న కీలక బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శాసనమండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
అంతకుముందు మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ దస్త్రాలతో ఇంటి నుంచి బయల్దేరారు. రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని మంత్రి తెలిపారు. అసెంబ్లీకి బయల్దేరే ముందు జూబ్లీహిల్స్‌లో శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని మంత్రి దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.