తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్లే వైద్యారోగ్యశాఖలో మంచి ఫలితాలు: హరీశ్‌రావు - రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు

Minister Harish Rao: రాష్ట్ర ప్రభుత్వ కృషి, వైద్యారోగ్యశాఖ పనితీరుకు మంచి ఫలితాలు వస్తున్నాయని మంత్రి హరీశ్​రావు అన్నారు. అన‌వ‌స‌ర సిజేరియ‌న్లను ఇంకా త‌గ్గించ‌డంతో పాటు ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో ప్రస‌వాల శాతం మ‌రింత పెరిగేలా కృషి చేయాల‌ని స్పష్టం చేశారు. ప్రాథమిక స్థాయిలోనే రోగాన్ని గుర్తించి, సకాలంలో వైద్యం అందిస్తే ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు.

Minister Harish Rao
Minister Harish Rao

By

Published : Nov 5, 2022, 8:17 PM IST

Minister Harish Rao: రాష్ట్రప్రభుత్వ కృషి వల్లే, వైద్యారోగ్యశాఖలో మంచి ఫలితాలు వస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతేడాది రాష్ట్రంలో సిజేరియన్లు 6శాతం తగ్గాయని వివరించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు 33శాతం ఉంటే ప్రస్తుతం 66శాతానికి పెరిగాయని వివరించారు. పీహెచ్​సీలు, ఆశా, ఏఎన్​ఎంలతో నెల‌వారీ స‌మీక్ష నిర్వహించిన హరీశ్‌, వ్యాధి నివారణ చర్యల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పాత్ర కీలకమని చెప్పారు.

ప్రాథమిక స్థాయిలోనే రోగాన్ని గుర్తించి, సకాలంలో వైద్యం అందిస్తే ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు. గ‌ర్బిణిల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్న హరీశ్‌రావు ప్రతిగర్భిణికి నాలుగుసార్లు తప్పకుండా ఏఎన్​సీ చెకప్ చేయాలని సూచించారు. రక్తహీనత ఉన్నవారిని గుర్తించి, పర్యవేక్షించాలని చెప్పారు. రాష్ట్రంలో 43 పీహెచ్​సీలకు కొత్త భవనాలు మంజూరు చేసి 67 కోట్లతో నిర్మిస్తున్నట్టు తెలిపారు. మరో 43 కోట్లతో 372 పీహెచ్​సీల మరమ్మతులు చేపట్టినట్లు చెప్పారు. ప్రజలకు నాణ్యమైన సేవల కోసం 720 పీహెచ్​సీలో ఇంటర్నెట్ సదుపాయం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి హరీశ్‌రావు వివరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details