ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల ఖాళీల సంఖ్యపై ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. మంత్రులు, సంబంధిత శాఖల అధికారులతో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు భేటీ అయ్యారు. ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఐదు రోజుల్లోగా ఆర్థికశాఖకు అందించాలని అన్ని శాఖలను కేబినెట్ ఇటీవల ఆదేశించింది. అందుకు అనుగుణంగా సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమావేశమై ఇప్పటికే సమీక్షించారు.
Harish rao: అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై మంత్రి హరీశ్ సమీక్ష - తెలంగాణ వార్తలు
అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ ఖాళీలపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్షిస్తున్నారు. ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఐదు రోజుల్లోగా ఆర్థికశాఖకు అందించాలని కేబినెట్ ఇటీవల ఆదేశించింది. ఐదు రోజులు పూర్తయిన నేపథ్యంలో మంత్రులు, అధికారులతో హరీశ్ చర్చిస్తున్నారు.
మంత్రి హరీశ్ రావు సమీక్ష, ఉద్యోగ ఖాళీలపై హరీశ్ సమీక్ష
ఐదు రోజుల గడువు పూర్తైన నేపథ్యంలో ఖాళీలపై ఇవాళ శాఖల వారీగా మంత్రి సమీక్షిస్తున్నారు. మంత్రులు, అధికారులతో సమావేశమై ఆయా శాఖల్లోని పోస్టుల వర్గీకరణ, ఖాళీలు సంబంధిత సమాచారంపై ఆరా తీస్తున్నారు. అన్ని శాఖలకు సంబంధించిన సమాచారం, వివరాలను క్రోడీకరించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి:Etela Rajender: భాజపా నేత ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభం