Harish Rao Review: వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. వైద్యవిద్య పరిధిలోని ఆస్పత్రుల పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి హరీశ్‌రావు... టీచింగ్ ఆస్పత్రుల్లో అందే వైద్యసేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రసూతి, ఆర్ధోపెడిక్, సాధారణ శస్త్రచికిత్సలతోపాటు పీడియాట్రిక్ విభాగంలో ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్లు పెరగాలని, ఎన్ఐసీయూ, పీఐసీయూ సేవలు అందేలా చూడాలన్నారు. ఆపరేషన్ థియేటర్ వినియోగం పెంచడంతోపాటు పెద్ద శస్త్రచికిత్సలు పెరగాలని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అన్నిరకాల ఔషధాలు అందుబాటులో ఉంచినందునా... ఎట్టి పరిస్థితుల్లో మందులు బయటికి రాయొద్దని చెప్పారు. మార్చురీల ఆధునీకరణ, వెంటిలేటర్ల పనితీరు, డయాలసిస్ కేంద్రాలపై దృష్టి పెట్టాలన్నారు. అన్నివసతులు అందుబాటులో ఉన్నందునా.....అత్యవసర వైద్యసేవలు జిల్లా స్థాయిలోనే అందించేలా చూడాలని మంత్రి హరీశ్‌రావు...వైద్యశాఖ ఉన్నతాధికారులకు సూచించారు.
Harish Rao Review: 'వైద్యులు ఉ.9 నుంచి సా.4 వరకు అందుబాటులో ఉండాలి' - harish rao news
Harish Rao Review: వైద్యవిద్య పరిధిలోని ఆస్పత్రుల పనితీరుపై ఆ శాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండాలని సూచించారు.
Harish Rao