తెలంగాణ

telangana

ETV Bharat / state

Harishrao Review On Health: 'ఆసుపత్రుల్లో ఇక నెలనెలా ఆకస్మిక తనిఖీలు' - Harish rao reivew on health dept

Harishrao Review On Health: వైద్యారోగ్య శాఖపై ఆ శాఖ మంత్రి హరీశ్​రావు సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య సూచీలో తెలంగాణను మొదటి స్థానంలో నిలపాలని మంత్రి స్పష్టం చేశారు.

Harishrao
Harishrao

By

Published : Apr 3, 2022, 10:24 PM IST

Harishrao Review On Health: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచడం సహా ప్రైవేట్​లో సీజేరియన్​లపై పరిశీలన చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది, ఉన్నత అధికారులతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరోగ్య సూచీలో తెలంగాణను మొదటి స్థానంలో నిలపాలని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏఎన్ఎంలు, పీహెచ్​సీ వైద్యులు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, డీఎంహెచ్​ఓలతో నిర్వహించిన సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి సహా పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

ఈనెల 7న వరల్డ్ హెల్త్ డే సందర్భంగా వైద్యారోగ్య శాఖలోని ప్రతి విభాగం నుంచి ఉత్తమ పనితీరు కనబరిచిన ముగ్గురిని ఎంపిక చేసి సన్మానించనున్నట్టు తెలిపారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా నెలనెలా సర్ప్రైజ్ విజిట్​లు ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం ఎన్​హెచ్ఎంపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ, డీహెచ్, ఓఎస్డీ గంగాధర్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానాలు, టీ డియాగ్నోస్టిక్స్, ఎన్​సీడీ స్క్రీనింగ్, టీబీ వంటి విభాగాల పురోగతిని పరిశీలించారు.

ఇదీ చదవండి:పబ్​పై పోలీసుల దాడులు.. అదుపులో ప్రముఖ సింగర్​, నటులు

ABOUT THE AUTHOR

...view details