Harish Rao on haritha nidhi:
రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు... ఏర్పాటు చేసిన హరిత నిధితో దేశంలోనే మిగిలిన రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హరిత నిధి అంశంపై అసెంబ్లీ కమిటీ హాల్లో... మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సంబంధిత అధికారులతో హరీశ్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు.
హరిత తెలంగాణ సాధనలో సమాజంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం... విరాళాల రూపంలో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిధి ఏర్పాటు చేస్తూ... ఉత్తర్వులు జారీ చేసిందని హరీశ్ పేర్కొన్నారు. ఏప్రిల్ నెల జీతాల నుంచి ఈ విరాళాల జమ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల ఏప్రిల్ నెల జీతాల నుంచి కొద్ది మొత్తం హరితనిధికి జమ చేయనున్నట్లు... హరీశ్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధిత శాఖలు అంతర్గత ఉత్తర్వుల ద్వారా పనిని ప్రారంభించాలని.... ఆదేశించారు.