ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా... ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేలా బడ్జెట్ ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 2022-23 వార్షిక బడ్జెట్‌లో కేసీఆర్ మార్కు కనిపిస్తుందన్నారు. రైతులకు, పేద ప్రజలకు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉంటుందన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఆయన నివాసం నుంచి బయల్దేరిన హరీశ్‌రావు.... బంజారాహిల్స్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
అక్కడి నుంచి శాసనసభకు మంత్రి హరీశ్‌రావు చేరుకున్నారు. సభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ను కలిసిన మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి... బడ్జెట్ ప్రతులు అందించారు. కాసేపట్లో అసెంబ్లీలో పద్దును మంత్రి హరీశ్ ప్రవేశపెట్టనున్నారు.
బడ్జెట్‌లో రైతులు, సామాన్యులకు పెద్దపీట వేస్తున్నాం. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశాం. ఈ బడ్జెట్‌లో కేసీఆర్ మార్క్ కనిపిస్తుంది.