ఉద్యోగుల సంక్షేమాన్ని ఎల్లప్పుడూ ఆకాంక్షించే ప్రభుత్వం తమదని, అందుకే అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. పీఆర్సీ పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో ఉద్యోగులు నిర్వహించిన సంబరాల్లో హరీశ్ రావు పాల్గొన్నారు.
అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీని సీఎం ప్రకటించారు: హరీశ్ - minister harish rao on prc at aranya bhavan
పీఆర్సీ పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ... అటవీశాఖ ఉద్యోగులు అరణ్య భవన్‌లో సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీని సీఎం ప్రకటించారని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ వెల్లడించారు.

అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీని సీఎం ప్రకటించారు: హరీశ్
ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ ఎంతో సానుకూలంగా ఉంటారని హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగులు ముందుండాలని, వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందుంటుందని ఆర్థికమంత్రి అన్నారు. అటవీ ఉద్యోగుల తరఫున అటవీ సంరక్షణ ప్రధాన అధికారి శోభ..... ప్రభుత్వానికి, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొన్న అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బంది, వివిధ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.