తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే మనదగ్గర వైద్యకళాశాలలు: మంత్రి హరీశ్​ - minister harish rao speech in assembly

Minister Harish rao on medical colleges: రాష్ట్రంలో వైద్యకళాశాలల సంఖ్య 33కిపెరుగుతున్నాయని మంత్రి హరీశ్​రావు అసెంబ్లీలో పేర్కొన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి హరీశ్​రావు సమాధానమిచ్చారు.

Minister Harish rao on medical colleges in telangana
అసెంబ్లీలో మంత్రి హరీశ్​రావు ప్రసంగం

By

Published : Mar 14, 2022, 1:34 PM IST

అసెంబ్లీలో మంత్రి హరీశ్​రావు ప్రసంగం

Minister Harish rao on medical colleges

ఉక్రెయిన్‌, చైనా దేశాలకు పోయి... వైద్య విద్య అభ్యసించే పరిస్థితి రాకుండా ఉండేందుకే... రాష్ట్రంలో వైద్యకళాశాలల సంఖ్య పెంచామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో... సభ్యులు కోరుకంటి చందర్‌, జనార్ధన్‌రెడ్డి, గాదరి కిషోర్‌ కుమార్‌, హరిప్రియ నాయక్‌లు... అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

కేంద్రప్రభుత్వం ఏ మాత్రం సహకరించకపోయినా... వైద్యకళాశాలల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి పేర్కొన్నారు. మృతదేహాలు లేక వైద్యకళాశాలల్లో... బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. త్వరలో చట్టసవరణ చేసిన... ఆ సమస్యను పరిష్కరిస్తామని... హరీశ్‌ వెల్లడించారు.

రాష్ట్రంలో వైద్యకళాశాలలు 3 నుంచి 33కిపెరుగుతున్నాయి. వైద్య కళాశాలల విషయంలో కేంద్రం అన్యాయం చేసింది. కేంద్రం ఇస్తే ఒక్కో కళాశాలకు రూ.200 కోట్లు వచ్చేవి. ప్రతిపాదనలు పంపినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. వచ్చే ఏడాది 2,850 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయి. వైద్యకళాశాలల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేస్తున్నాం. వైద్య కళాశాలల కోసం మృతదేహాల లభ్యత చాలా అవసరం. గుర్తించని మృతదేహాలను ఇచ్చేలా చట్టసవరణ చేయాల్సి ఉంది.

-హరీశ్‌రావు , వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి

త్వరలోనే ఆస్పత్రుల నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌కు వెళ్లిన విద్యార్థుల బాధలు వర్ణనాతీతమన్నారు. పీజీ సీట్ల సంఖ్యను 531 నుంచి 938కి పెంచామని వివరించారు.

ఇదీ చదవండి:Special Grants to Telangana : కేంద్రంపై తెలంగాణ ఆశ.. నిధులు అందక నిరాశ

ABOUT THE AUTHOR

...view details