రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున చేపడతామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. 2022లో పంట సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంచుతామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుపై మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Harish Rao: 'రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికలు' - అధికారులతో హరీశ్ రావు సమావేశం
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంచుతున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుపై మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆయిల్ పామ్ విస్తీర్ణంపై మంత్రి హరీశ్ రావు
ఆయిల్ పామ్ సాగుతో రైతులు బాగా లబ్ది పొందుతారన్న హరీశ్ రావు... ఈ పంట పర్యావరణహితమైనదని పేర్కొన్నారు. అయితే వాటి మొక్కల లభ్యతే సమస్య అని... అందుకోసం ఆయిల్ పామ్ నర్సరీల సాగుపై వివిధ శాఖల అధికారులు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రైతుబంధు సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, నాబార్డు, టెస్కాబ్ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.