తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈ నెల 12 నుంచి రోగుల సహాయకులకూ ఉచిత భోజనం'

Minister Harish rao on Hospitals: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30 నుంచి 56 శాతం పెరిగాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. సాధారణ ప్రసవాలు చేసిన సిబ్బందికి ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. హైదరాబాద్​లోని పలు ఆస్పత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీశ్​ శ్రీకారం చుట్టారు. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో సీటీ స్కాన్​ యంత్రాన్ని ప్రారంభించడంతో పాటు.. కోటి ఈఎన్​టీ ఆస్పత్రిలో ఇంటిగ్రేటెడ్​ బిల్డింగ్​ కాంప్లెక్స్​కి శంకుస్థాపన చేశారు.

Minister Harish rao on Hospitals
మంత్రి హరీశ్​ వార్తలు

By

Published : May 6, 2022, 2:39 PM IST

Minister Harish rao on Hospitals: ప్రభుత్వాసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్యారోగ్యశాఖకు బడ్జెట్‌ రెట్టింపు చేశారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్‌ ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో రూ. 2.15 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌ను మంత్రి హరీశ్​ ప్రారంభించారు. కోఠి ఈఎన్​టీ ఆస్పత్రిలో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్‌కి శంకుస్థాపన చేశారు. అనంతరం సుల్తాన్​బజార్​లోని మెటర్నిటీ ఆస్పత్రిలో ఆపరేషన్​ థియేటర్​కు కావాల్సిన పరికరాలను ప్రారంభించారు.

ఈ నెల 11న నగరంలో 10 రేడియాలజీ ల్యాబ్​లను ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్​ తెలిపారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు చెప్పారు. రోగి వెంట ఉండే సహాయకులకు భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్న మంత్రి.. హైదరాబాద్‌లోని 18 ఆస్పత్రుల్లో ఈనెల 12 నుంచి ఉచిత భోజనం ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. కోఠి ప్రసూతి ఆస్పత్రిలో సాయంత్రం ఓపీ కూడా ప్రారంభించాలని... అందుకు అవసరమైన సిబ్బందిని కేటాయిస్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎవరైనా వైద్యులు అవసరంగా టెస్టులు, సర్జరీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

"నిజాం కాలంలో కట్టిన ఆస్పత్రుల్లోనే గత ప్రభుత్వాలు ఇంతకాలం వైద్యులకు సేవలందించాయి. సీఎం కేసీఆర్​ పాలనలో పరిస్థితులు మారాయి. హైదరాబాద్​కు నలువైపులా 4000 పడకలతో 4 సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి రానున్నాయి. నిమ్స్​లో మరో 2000 పడకలు ఏర్పాటు చేశాం. ఈ నెల 12 నుంచి రోగుల సహాయకులు ఉచిత భోజనం ఏర్పాటు చేస్తాం. అంటే బయట రూ. 5 భోజన పథకం లాగా.. ఆస్పత్రుల్లో రూ. 5 చెల్లిస్తే నాణ్యమైన భోజనం అందిస్తాం. అంతే కాకుండా వారికోసం షెల్టర్లను కూడా కట్టించాలని కేసీఆర్​ నిర్ణయించారు." -హరీశ్​ రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

ఇక ఈ సందర్భంగా రోగులతో ముచ్చటించిన మంత్రి.. వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాల్లో మంత్రి మహమూద్​ అలీ, ఎమ్మెల్యే గోపీనాథ్, భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

6 వేల సూపర్‌స్పెషాలిటీ పడకలు కొత్తగా నిర్మాణం : హరీశ్‌

ఇవీ చదవండి:కేటీఆర్​, కవిత ట్వీట్​లకు రేవంత్​ కౌంటర్.. ​ఏమన్నారంటే..?

దిల్లీ భాజపా నేతను అరెస్ట్​ చేసిన పంజాబ్​ పోలీసులు.. హరియాణాలో టెన్షన్​!

ABOUT THE AUTHOR

...view details