జీఎస్టీ కౌన్సిల్ 42వ సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల మంత్రులు దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు... ఉన్నతాధికారులతో కలిసి బీఆర్కే భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
'జీఎస్టీ మండలి ప్రతిపాదనల్లో ఆ రెండింటికి తెలంగాణ తిరస్కరణ' - జీఎస్టీ కౌన్సిల్ సమావేశం వార్తలు
దృశ్యమాధ్యమం ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. జీఎస్టీ పరిహారం, ఐజీఎస్టీ చెల్లింపులపై చర్చించారు.
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు
'జీఎస్టీ మండలి ప్రతిపాదనల్లో ఆ రెండింటికి తెలంగాణ తిరస్కరణ'
జీఎస్టీ మండలి... రాష్ట్రాల ముందుంచిన 2 ప్రతిపాదనలను.. తెలంగాణ తిరస్కరించింది. జీఎస్టీ పరిహారం, ఐజీఎస్టీ చెల్లింపులపై కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని హరీశ్ రావు కోరగా... ఇతర రాష్ట్రాల మంత్రులు సైతం దీనికి ఒప్పుకున్నారు.
ఇదీ చూడండి:'నదీ జలాల వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే'