జీఎస్టీ కౌన్సిల్ ఆన్లైన్ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్తో కలిసి మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రతిపాదనలు, డిమాండ్లను సమావేశంలో వివరించారు. తెలంగాణకు రావాల్సిన రూ. 5,420 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు.
'మాకు రావాల్సిన రూ.2,700 కోట్లు ఇవ్వండి' - harish rao in gst council meeting
జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు కోరారు. తెలంగాణకు రావాల్సిన రూ.5,420 కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
జీఎస్టీ కౌన్సిల్లో మంత్రి హరీశ్ రావు
కేంద్రం వెంటనే జీఎస్టీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిహారంలో సెస్ మిగిలితే కన్సాలిడేట్ ఫండ్లో జమ చేసి కేంద్రమే వాడుకుంటోందని స్పష్టం చేశారు. సెస్ తగ్గినప్పుడు రాష్ట్రాలు అప్పు తీసుకోవాలనడం సరికాదన్నారు. ఐజీఎస్టీ సమావేశం వెంటనే నిర్వహించాలని, రాష్ట్రానికి రావాల్సిన 2,700 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి:బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ కీలక సూచనలు