Harish Rao Comments on Jobs Notification in Telangana : పేద ప్రజలకు న్యాణమైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్రం ప్రభుత్వం నూతన మెడికల్ కాలేజీలను, ఆసుత్రులను ఏర్పాటు చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి హారీశ్‌రావు అన్నారు. పెరిగిన ఆసుత్రులకు అనుగుణంగా.. కొత్తగా నియామకమైన వేయి 61మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు హైదరాబాద్‌లో నియామక పత్రాలను అందించారు. ఒకే రోజు వేయి 61 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం అనేది వైద్య విద్య రంగంలోనే పెద్ద రికార్డుగా ఆయన పేర్కొన్నారు.
ప్రథమ స్థానంలో ఉండేలా అందరూ కృషి చేయాలి : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకంలో అత్యంత పారదర్శకం పాటిస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతంలో ఒక లక్ష 50 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం... మరోసారి 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వబోతున్నామని.. అందులో భాగంగా ఇవాళ 1061 మంది డాక్టర్లకు ఉద్యోగ నియామకపత్రాలు అందిస్తున్నామని తెలిపారు. ఏళ్ల తరబడి పని చేసిన ఆయుష్ కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించామని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలో పేదలకు సేవలందించడంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వమైన ఉత్తర ప్రదేశ్ చివరి స్థానంలో ఉందని గుర్తు చేశారు. వచ్చే ఏడాది వరకు మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా అందరూ కృషి చేయాలని మంత్రి హరీశ్‌రావు కోరారు.