తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర వైద్యారోగ్యరంగం దేశానికే ఆద‌ర్శంగా మారుతోంది: హరీశ్‌రావు

harish rao: రాష్ట్రంలోని మ‌రో 13 ప్రభుత్వ ఆసుపత్రులు కేంద్ర వైద్యారోగ్య శాఖ నుంచి నేష‌న‌ల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండ‌ర్డ్స్‌ స‌ర్టిఫికెట్లు సాధించడంతో పాటు, మరో మూడు ఆసుపత్రులకు రీ-సర్టిఫికేషన్ వచ్చినట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ... రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి శుభాకాంక్షలు తెలిపిందని.. వివరించారు.

రాష్ట్ర వైద్యారోగ్యరంగం దేశానికే ఆద‌ర్శంగా మారుతోంది: హరీశ్‌రావు
రాష్ట్ర వైద్యారోగ్యరంగం దేశానికే ఆద‌ర్శంగా మారుతోంది: హరీశ్‌రావు

By

Published : Jun 25, 2022, 5:36 PM IST

Harish rao: రాష్ట్రంలోని మ‌రో 13 ప్రభుత్వ ఆసుపత్రులు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నుంచి నేష‌న‌ల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండ‌ర్డ్స్‌ (ఎన్​క్యూఏఎస్​) స‌ర్టిఫికెట్లు సాధించడంతో పాటు, మరో మూడు ఆసుపత్రులకు రీ-సర్టిఫికేషన్ వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు. లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్ నిర్వహణలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు నిర్మల్ ఏరియా ఆసుపత్రికి "లక్ష్య" గుర్తింపు లభించినట్లు చెప్పారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి.. వైద్య, ఆరోగ్య శాఖకు శుభాకాంక్షలు తెలిపిందని మంత్రి అన్నారు.

రాష్ట్రంలో మొత్తం 143 ఆసుప‌త్రుల‌కు ఎన్‌క్వాష్ గుర్తింపు వ‌చ్చిందని, ఈ గుర్తింపు క‌లిగిన ఆసుప‌త్రులు అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుప‌త్రుల‌కు ఈ గుర్తింపు కోసం ప్రభుత్వం కృష్టి చేస్తుందన్న ఆయన.. ఆ దిశ‌గా అవ‌స‌ర‌మైన చ‌ర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మొదటి స్థానమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులకు జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ వైద్య సేవల్లో నాణ్యతా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని.. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ జాతీయస్థాయి గుర్తింపే నిదర్శనమన్నారు.

రాష్ట్రంలో పీహెచ్‌సీ స్థాయి నుంచి ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగం దేశానికే ఆద‌ర్శంగా మారుతోందని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన జాతీయస్థాయి నాణ్యతా ప్రమాణాల గుర్తింపును తెలంగాణలోని జిల్లా, ప్రాంతీయ, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సాధిస్తున్నాయని హరీశ్​రావు సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేస్తున్న వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు. స్వ‌రాష్ట్రంలో ప్ర‌భుత్వం వైద్య, ఆరోగ్య రంగాన్ని ప‌టిష్టం చేస్తోందన్న ఆయన.. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో మౌలిక వ‌స‌తులు మెరుగయ్యాయని అన్నారు. విలువైన వైద్య ప‌రిక‌రాలు అందుబాటులోకి వ‌చ్చాయని.. ఓపీ, ఐపీ, స‌ర్జిక‌ల్ ఇలా అన్ని విభాగాల్లో నాణ్య‌త పెరిగిందని మంత్రి వివరించారు. దీంతో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఉచితంగా, నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందుతున్నాయని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు జాతీయస్థాయి గుర్తింపు రావడం సంతోషం. కేసీఆర్ నాయకత్వంలో వైద్య సేవల్లో నాణ్యతా ప్రమాణాలు పెరిగాయి. నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్ర వైద్యారోగ్యరంగం దేశానికే ఆద‌ర్శంగా మారుతోంది. మొత్తం 143 ఆసుప‌త్రుల‌కు ఎన్‌క్వాష్ గుర్తింపు వ‌చ్చింది. గుర్తింపు క‌లిగిన రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది.-హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి

ఇవీ చూడండి..

ఫ్లిప్​కార్ట్​తో సెర్ప్ ఒప్పందం.. ఇకపై ఆన్​లైన్​లో ఆ వస్తువులు

బైక్​పై హెల్మెట్​ లేకుండా ఎమ్మెల్యే, మంత్రి.. రూ.1,000 ఫైన్ వేసిన ట్రాఫిక్​ పోలీస్​

ABOUT THE AUTHOR

...view details